మూడు రోజులుగా ముండ్లమూరులో భూ ప్రకంపనలు..! 12 h ago
AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూప్రకంపనలు ఆగలేదు. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుసగా భూమి కంపిస్తుంది. తాజాగా, సోమవారం 10.35 గంటల సమయంలో సెకను పాటు మరోసారి భూమి కంపించింది. శనివారం, ఆదివారం కూడా 10.35 గంటల సమయంలోనే భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపద్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.